పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శం: ఎమ్మెల్యే బొల్లం

పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శం: ఎమ్మెల్యే బొల్లం

కోదాడటౌన్ ముద్ర: తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా గురువారం  చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో  నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు గ్రామాలు ఎట్లా ఉండే తెలంగాణ వచ్చాక గ్రామాలు  ఎట్లా ఉన్నాయో ప్రజలందరూ  గమనించాలని అన్నారు. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి,పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల  పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశలవారీగా పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు.

పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు పేరుకుపోయిన చెత్తా చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీ, డంపింగ్‌యార్డుల్లో పిచ్చి మొక్కలు తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో నేడు పల్లెలు పరిశుభ్రతతో కనిపిస్తున్నవి అని ఆయన అన్నారు. బేతవోలు అభివృద్ధికి  కార్యక్రమం కింద మొత్తం 10  కోట్లను ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ది చేశాం అని తెలిపారు.

సమగ్ర గ్రామీణ అభివృద్ధికై నూతన పంచాయతీ రాజ్ చట్టం అమలు చేస్తున్నాం అని అన్నారు.ప్రతి గ్రామపంచాయతీకి పంచాయతీ కార్యదర్శిని నియమించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకరు, ట్రాలీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ  అని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీ, పల్లె ప్రకృతివనము, ఏవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధిచేసిన మంచి నీటిని సరఫరా చేస్తున్న దేశంలోనే ప్రథమ రాష్ట్రం తెలంగాణ ఆయన అన్నారు.ఇవ్వాళ పల్లెల్లో పల్లె ప్రగతి పండుగ జరుగుతున్నదని అన్నారు.

అనంతరం పంచాయతీ సిబ్బందిని ఎమ్మెల్యే  సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య, రైతు సమన్వయ సమితి నాయకులు బజ్జూరు వెంకటరెడ్డి,  సొసైటీ వైస్ చైర్మన్  అక్కెనపల్లి జానకి రామాచారి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ సురేష్ బాబు, సొసైటీ చైర్మన్లు  జనార్ధన్, సైదులు, మాజీ జెడ్పిటిసి శివాజీ నాయక్,మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కొవ్వూరు వెంకటేశ్వర్లు, బెల్లంకొండ నాగయ్య, తాసిల్దార్ రాజేశ్వరి,ఎంపీడీవో ఈదయ, ఎంపీటీసీలు ధనమూర్తి, సైదా బాబు, గ్రామ పాలకవర్గ సభ్యులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.