నేటినుండి శంషాబాద్ ముచ్చింతల్ లో సమతా కుంభ్ 2023 ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

నేటినుండి శంషాబాద్ ముచ్చింతల్ లో సమతా కుంభ్ 2023 ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
Samatha Kumbh 2023 celebrations will begin in Shamshabad Muchinthal from today

శంషాబాద్, రంగారెడ్డి, ముద్ర: శంషాబాద్ ముచ్చింతల శ్రీ రామ నగరంలో గురువారం నుండి సమత కూంబ్ 2023 ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యవి నేటి నుండి 10 రోజుల పాటు రామానుజాచార్య-108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలకోసం వైభవంగా ముస్తాబైన సమతా మూర్తి కేంద్రం సువర్ణమూర్తి  భగవద్రామానుజుల వారికి ఉత్సవారం భన్నపనంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న సమతా మూర్తి కేంద్రం విశ్వక్సేన వీధీ శోధన, ఆరాధన -బ్రహ్మోత్సవాలకు ముందు విఘ్న నివారణ కోసం విష్వక్సేన పూజ నిర్వహిస్తారు అనంతరం  శ్రీమన్నారాయణుడి సేనాథిపతిగా..బ్రహ్మత్సవాలకు ఎలాంటి ఆంటకాలు రాకుండా చూస్తారు విష్వక్సేనులు.

ఉత్సవాలకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడ్డమే విష్వక్సేనులవారి విధి. ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఘనంగా నిర్వహిస్తారు ఈ యొక్క పది రోజుల ఉత్సవాలకు శంషాబాద్ మండల పరిధిలో కాక రంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుండి భారీగా ప్రజలు చేరుకుని శ్రీ రామానుజ మొదటి వార్షికోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.