స్కాలర్షిప్ టెస్ట్ అస్త్రను సద్వినియోగం చేసుకోవాలి

స్కాలర్షిప్ టెస్ట్ అస్త్రను సద్వినియోగం చేసుకోవాలి

అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ విన్నకోట
ముద్ర, ముషీరాబాద్: అనలాగ్ ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న స్కాలర్షిప్ టెస్టు అస్త్రను నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ విన్నకోట తెలిపారు. ఇంద్ర పార్క్ చౌరస్తాలోని సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సివిల్స్ లో 40వ ర్యాంకు సాధించిన సాయి ఆశ్రత్ శాఖమూరితో కలిసి అస్త్ర స్కాలర్ షిప్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ విన్నకోట మాట్లాడుతూ ఐఏఎస్ చదవాలనుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల మెరిట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇటీవల సివిల్స్ లో 40వ ర్యాంకు సాధించిన సాయి హష్రిత్ శాఖమూరి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో శిక్షణ పొందడానికి ప్రత్యేకంగా అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో చేరడం జరిగిందన్నారు. ఇక్కడ ఉన్న ప్యానల్ సభ్యులు తనకి ఇచ్చిన సూచనలు సలహాలు మెలకువలు అడిగిన ప్రశ్నలు తాను విజయం సాధించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ విన్నకోట ఆధ్వర్యంలో 40వ ర్యాంకు సాధించిన సాయి ఆష్రిత్ శాఖమూరిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. పలువురు సంస్థ సభ్యులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.