అంగన్వాడీల్లో చిరుధాన్యాల వంటల పోటీలు

అంగన్వాడీల్లో చిరుధాన్యాల వంటల పోటీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలంలోని అంగన్వాడీల్లో బుధవారం చిరుధాన్యాల వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ భాగ్యవతి మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో లక్ష్మణ చాంద సెక్టార్ లో పొట్లపల్లి, తిరుపల్లి లు, వడ్యాల్ సెక్టార్ లో బోరిగాం, నర్సాపూర్ గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘు నందన్ రెడ్డి, జెడ్పీటీసీ ఒస రాజేశ్వర్, తహశీల్దారు కవిత తదితరులు పాల్గొన్నారు.