అత్యంత భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి వేడుకలు

అత్యంత భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మహా శివరాత్రి పవిత్ర పర్వదినం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల దేవాలయాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు సోన్, బాసర తదితర ప్రాంతాల్లోని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కదిలి పాపహరేశ్వరాలయం, బాబాపూర్ లోని రాజేశ్వర ఆలయం, నిర్మల్ ఓంకారేశ్వర ఆలయం, హరిహర క్షేత్రం, శివకోటి మందిరం, ఎడ్బిడ్ లోని శివాలయం, నగరేశ్వరాలయం లలో అర్ధరాత్రి నుంచి భక్తులు బారులు తీరారు. పలు ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ సంఘాలు సంస్థలు తోడ్పాటు అందించాయి. నిర్మల్ కు చెందిన శ్రీ ధర్మశాస్త్ర యూత్ ఆధ్వర్యంలో కదిలి దేవాలయం లో మంచినీటిని సరఫరా చేశారు.