హైదరాబాద్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజక్షన్స్ పట్టివేత

హైదరాబాద్‌: భాగ్యనగరంలో భారీ స్టెరాయిడ్ ఇంజక్షన్స్ పట్టుబడ్డాయి. జిమ్‌లలో ఎక్సైజ్ చేస్తున్న యువకులే టార్గెట్‌గా ముఠా సభ్యులు ఈ ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  ఈ ఇంజక్షన్ ద్వారా తక్కువ సమయంలో శరీరాన్ని అనుకున్న ఆకృతిలో తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.

కాగా... స్టెరాయిడ్ ఇంజక్షన్ల సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు... ముఠా సభ్యులను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు.  మొత్తం ముగ్గురు వ్యక్తులు స్టెరాయిడ్ ఇంజక్షన్లను సరఫరా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 180 ఇంజక్షన్లు, 1100 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఓంప్రకాష్, సరోదే నరేష్, సయ్యద్ ఫరూక్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.