కెసిఆర్ ను గద్దె దించడానికి అందరూ కలిసి రావాలి

కెసిఆర్ ను గద్దె దించడానికి అందరూ కలిసి రావాలి
  • రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను నెరవేరుస్తుంది
  • మాట తప్పని మడమ తిప్పని మహానాయకుడు వైయస్సార్
  • వైయస్సార్ కుటుంబంతో విడదీయరాని అనుబంధం
  • కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలన్న వైఎస్సార్ టిపి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
  • మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
  • దామోదర్ రెడ్డి విజయంలో భాగస్వాములు అవుతాం
  • పార్టీ శ్రేణులకు వైయస్సార్ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్ట రామ్ రెడ్డి పిలుపు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ముఖ్యమంత్రి కెసిఆర్ ను గద్దె దించడానికి అందరూ కలిసి రావాలని, ఏకం కావాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటిని తు చ తప్పకుండా అమలు చేస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం వైయస్సార్ టిపి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సూర్యాపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ పిట్ట రామ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ టిపి నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని దామోదర్ రెడ్డి చెప్పారు. వైయస్సార్ అంటేనే మాట తప్పని మడమ తిప్పని నాయకుడని వైయస్సార్ కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్లుగా విడదీయరాని అనుబంధం ఉందని వివరించారు.

వైయస్సార్ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రామ్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో విజయం సాధించనున్న రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గెలుపులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుదా మని పిలుపునిచ్చారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేసి కాంగ్రెస్ విజయం కోసం తమ వంతుగా కృషి చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, ఎసిసి నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,బొజ్జ సంధ్యారెడ్డి, చింతమల రమేష్, గంగాధర్, డేగల రమేష్, కక్కిరేణి శ్రీనివాస్, పోలగాని బాలు, సాజిద్ ఖాన్, కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, డి ఆర్, సాయి నేత తదితరులు పాల్గొన్నారు.