గొల్లపల్లి ఎస్ ఐ గా చిర్ర సతీష్ బాధ్యతలు స్వీకరణ...
గొల్లపల్లి. ముద్ర: గొల్లపల్లి మండలం నూతన ఎస్ ఐ గా చిర్ర.సతీష్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పని చేసిన నరేష్ కుమార్.జిల్లా కేంద్రం ఎస్పీ కార్యాలయానికి విఆర్ కు వెళ్లారు.ఎస్ ఐ సతీష్ పెగడపెల్లి మండలం ఎస్ ఐ గా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు.ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.