మహిళా సాధికారిత కోసం కృషి

మహిళా సాధికారిత కోసం కృషి
  • జగిత్యాలలో 16న టీ-లైఫ్ సంస్థ ప్రారంభం
  • టీ-లైఫ్ సంస్థ రాష్ట్ర ఆర్గనైజర్ దీపికా రెడ్డి వెల్లడి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:మహిళలు అన్ని రంగాల్లో రాణించి తమకాళ్ళ మీద తాము నిలబడాలనే ధృడ సంకల్పంతో  టి-లైఫ్ అనే సంస్థను ఏర్పాటు చేశామని టీ-లైఫ్ రాష్ట్ర ఆర్గనైజర్ తాటిపర్తి దీపికా రెడ్డి అన్నారు. మహిళ సాధికారికత దిశగా అడుగులు వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు శిక్షణ ఇప్పిస్తు, అందుకోసం తీవ్ర కృషి చేస్తున్నామని  దీపికా రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మహిళలకు ఆయా రంగాల్లో శిక్షణ  ఇప్పించి వారికి ఉపాది అవకశాల కల్పన కోసం టీ-లైఫ్ మహిళ ఆర్గనైజింగ్ సంస్థ జగిత్యాలలో  ఏర్పాటు జరుగుతుందన్నారు.ఈనెల16 న జగిత్యాలలో మాజీమంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావా వసంత, జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ భాషా, జిల్లా జడ్జి నీలిమ, అదనపు కలెక్టర్ లత,డి ఎస్పీ రఘు చందర్, డాక్టర్ కనకదుర్గ తదితర ప్రముఖులచే టి-లైఫ్ సంస్థ  ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని టి-లైఫ్ రాష్ట్ర ఆర్గనైజర్ తాటిపర్తి దీపికా రెడ్డి తెలిపారు. మహిళలు ఈ సంస్థ ద్వారా శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు పొందాలని టి-లైఫ్ జగిత్యాల జిల్లా ఆర్గనైజర్ పొన్నాల శిరీషా రెడ్డి కోరారు.