తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి భువనగిరి : తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కొండపల్లి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూరెళ్ళ  యాదగిరి, కార్యదర్శులు పి.జగన్, కవిత, రాము, సోమయ్య, కిరణ్, జిల్లాఉపాధ్యాక్షులు సత్యలక్షి, కవిత, బాలనరసింహ, సభ్యులు ఉమా మహేష్,సత్యనారాయణ, ఉపేందర్ పాల్గొన్నారు.