తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారుడిగా హర్కార...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారుడిగా హర్కార...

ముద్ర, పెద్ద పల్లి ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దపల్లి జిల్లా  రామగుండం కు చెందిన హర్కార వేణుగోపాల్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ని ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులకు కెబినేట్ హోదా కల్పించింది. వీరిలో పెద్దపెల్లి జిల్లా నుంచి రామగుండం ప్రాంతం కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్కార వేణుగోపాల్ రావుకు ప్రాధాన్యత లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో కాల్, ప్రజా సంబంధ వ్యవహారాల ముఖ్య సలహాదారులుగా వేణుగోపాల్ రావుకు  పదవి కట్టబెట్టారు. రామగుండంకు చెందిన ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా, ప్రోటోకాల్ చైర్మన్ గా పనిచేశారు. ఏఐసీసీ  సభ్యులుగా కొనసాగుతున్న హర్కార వేణుగోపాల్ రావుకు కేబినెట్ పదవి లభించడం పట్ల రామగుండం  కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దపల్లి జిల్లా ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.