Telangana activist Advocate Vakkavantula passed away

Telangana activist Advocate Vakkavantula passed away

ముద్ర ప్రతినిధి, కోదాడ:  తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆంద్ర - తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడ లో ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన ఉద్యమకారుడు , లాయర్ వక్కవంతుల. విజయ్ కుమార్ శుక్రవారం కన్నుమూశారు . గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత మంది లో ఉన్న విజయ్ కుమార్ అని పేరు పెట్టి పిలిచే అంత దగ్గర సంబంధం కలిగిన వ్యక్తి మరణించటంతో సహచర ఉద్యమకారులు , కోదాడ బార్ అసోషియేషన్ లాయర్లు , ఇతర పార్టీల నేతలు అందరు విజయ్ కుమార్ మృతి వార్త తెలుసుకొని ఆయనకు సంతాపం ప్రకటించారు .