కల్వర్టులను పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి

కల్వర్టులను పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి

ముద్ర న్యూస్, కాటారం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గల కల్వర్టులను జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత పరిశీలించారు.ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల మూలంగా మండలంలోని పోతుల్వాయి,ఒడిపిలవంచ,ధన్వాడ గ్రామాల పరిధిలోగల కల్వర్టులు ఎత్తిపోస్తున్నాయి. నీటి ప్రవాహం అధికంగా ఉన్న క్రమంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులు ఉమాదేవి, శేఖర్ లను జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. ప్రవాహంలో పశువులు,మనుషులు వెళ్లకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు.