ఈనెల 29న తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సమర శంఖారావ సభకు స్థల పరిశీలన చేసిన మంత్రి, ఎమ్మెల్యే

ఈనెల 29న తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సమర శంఖారావ సభకు స్థల పరిశీలన చేసిన మంత్రి, ఎమ్మెల్యే

తుంగతుర్తి ముద్ర:-ఈనెల 29న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సమర శంఖారావం సభకు రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్లు సభాస్థలిని సోమవారంపరిశీలించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభగా ఏర్పాటు చేస్తున్న బి.ఆర్.ఎస్ సభకు వేలాదిగా ప్రజలను తరలించడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా విశాలమైన సభా ప్రాంగణాన్ని అలాగే అనుకూలమైన స్థలంలో సభా వేదికను నిర్మాణం చేయడానికి మంత్రి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేశారు .గత రెండుసార్లు ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గం పర్యటించినప్పుడు తిరుమలగిరిలోనే బహిరంగ సభలు ఏర్పాటు చేయడం ఈసారి కూడా తిరుమలగిరిలోనే బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు . ఇప్పటికే సభాస్థలి ఖరారు చేయడం ఏర్పాట్లను పరిశీలించడం లాంటి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి .ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే వెంట పలువురు టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.