యాంటీ షిప్​ మిస్సైల్​ పరీక్ష విజయవతం

యాంటీ షిప్​ మిస్సైల్​ పరీక్ష విజయవతం

సీకార్​: డీఆర్డీఓ దేశీయంగా తయారు చేసిన యాంటీ షిప్​ మిస్సైల్​ను 42–బీ యుద్ధ విమానం ద్వారా మంగళవారం పరీక్షించి విజయం సాధించినట్లు డీఆర్డీఓ ఎక్స్​ మాధ్యమంగా వెల్లడించింది. ఈ పరీక్షను నౌకాదళం, యుద్ధ హెలికాప్టర్​ ద్వారా రాజస్థాన్ లోని సీకార్ జిల్లాలో చేపట్టింది. ఎంచుకున్న లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో క్షిపణి చేధించిందని వెల్లడించాయి.

అంతర్జాతీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలను భారీ ఎత్తున భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా తయారు చేసే రక్షణ ఉత్పత్తులపై దృష్టి సారించాలని కేంద్రం ఆయా రక్షణ సంస్థలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో కంటే చురుగ్గా ఆయా సంస్థలు పనిచేస్తూ సొంతంగానే క్షిపణులు, ఆయుధాలను తయారు చేయడంపై చేయి సాధిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భారత్​ ఆయుధాలు, కిపణులను ఎగుమతి చేసేస్థాయికి చేరుకుంటుందని కేంద్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.