గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

కిలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్ చేసి వారివద్ద నుంచి కిలో గంజాయి సీజ్ చేసినట్లు రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ తెలిపారు. జగిత్యాల మండలం ధరూరు గ్రామం లో ఎస్.ఐ సధాకర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అంబేద్కర్ పల్లె ప్రకృతి వనం దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఒక కిలో గంజాయి లభించగా స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని జగిత్యాల రూరల్ తహసీల్దార్ సమక్షంలో వంచనమా నిర్వహించి నిందితులు ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు. నిందితులలో జగిత్యాల పట్టణం చిలుకవాడకు చెందిన యండి ఇర్ఫాన్, మార్కండేయ నగర్ కు చెందిన గంజి సాయిరాంతో మైనర్ బాలుడు ఉన్నట్లు అయన తెలిపారు.

గంజాయి పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్.ఐ సధాకర్, కానిస్టేబుళ్లను సి.ఐ అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ ఆరిఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ గంజాయి రవాణా, అమ్మడం, సేవించడం నేరము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని చట్టాలు బలంగా ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టిపెట్టాలి ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గ నిర్దేశం చేయాలి తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.