మహిళలల పట్ల దురుసుగా వ్యవహారించిన ఎస్ ఐ

మహిళలల పట్ల దురుసుగా వ్యవహారించిన ఎస్ ఐ
  • జగిత్యాలలో ఆందోళన చేపట్టిన ముస్లిం మైనారిటిలు 
  • ఎస్ఐ ఫై కేసు నమోద్ ... జిల్లా హెడ్ క్వాటర్ కు అటాచ్ చేసిన జిల్లా ఎస్పి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : మహిళల పట్ల జగిత్యాల రూరల్ ఎస్ ఐ అనిల్ దురుసుగా ప్రవర్తించి చెయి చేసుకున్నారని బాధిత మహిళల పక్షాన జగిత్యాల పట్టణంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జగిత్యాల పట్టణం జామ్ బాగుకు చెందిన ఇద్దరు మహిళలు ఆర్టిసి బసులో కరీంనగర్ నుంచి జగిత్యాల కు వస్తున్నారు. అదే బసులో రూరల్ ఎస్ఐ అనిల్ కుటుంబ సభ్యలు వస్తున్నారు.  అయతే బస్సు సీట్లో కూర్చునే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బసు జగిత్యాలకు చేరుకోగానే బసు డిపో వద్ద అప్పటికే వేచి ఉన్న ఎస్ఐ బసును ఆపి అందులో ఉన్న ఇద్దరు మహిళలతో  దురుసుగా మాట్లాడి చేయి చేసుకున్నట్లు బాధిత మహిళలు తెలిపారు. 

దీంతో వారు వారి కుటుంబ సభ్యలకు తెలుపగా ముస్లిం మైనారిటిలు పట్టణ పొలిసు స్టేషన్ సమిపంలో  పాత బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న టిపిపిసిసి ప్రధాన కార్యదర్శి ఉజ్మ షాకిర్ జగిత్యాలకు చేరుకొని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్, ముస్లిం సెంట్రల్ కమిటి అధ్యక్షుడు ఎంఎ భారి అధ్వర్యంలో ఉదయం నుంచి సాయత్రం వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డిఎస్పి ప్రకాష్ అదోలన కారులకు నచ్చ చెప్పిన వారు అందోళన విరమించ లేదు. ఎస్ఐ ఫై చర్యలు తీసుకోవాలని బాధితులు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను కలిసి కోరగ న్యాయం చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పి ఎగ్గడి బాస్కర్ బాధిత మహిళతో మాట్లాడి ఎస్ఐ ఫై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా అందోళన విరమించారు. ఎస్ఐ అనిల్ ఫై పట్టణ పోలీసులుకేసు నమోద్ చేయగ, ఎస్ ఐ అనిల్ ను జిల్లా హెడ్ క్వాటర్ కు అటాచ్ చేస్తూ రూరల్ ఎస్ ఐ గా రాయికల్ ఎస్ ఐ కిరణ్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తు  జిల్లా ఎస్పీ భాస్కర్ ఉత్తర్వులు జారి చేశారు.