రైతుల సంఘటితశక్తిగా ఎదగాలి

రైతుల సంఘటితశక్తిగా ఎదగాలి

కిసాన్ గ్రామీణ మేళా కన్వీనర్ పి సుగుణాకర్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: రైతుల పేదరికనికి, వెనుకబాటుకు ప్రధాన కారణం వారు సంఘటితంగా లేకపోవడం వలన రైతులు సహకార సంఘాలు లేదా ఎఫ్ పి ఓ లుగా సంఘటితమైనప్పుడే ఆర్థికంగా ఎదుగుతారని ప్రభుత్వాలు కూడా రైతు సమస్యలకు ప్రాధాన్యతనిస్తాయని అందువలన రైతులంతా సంఘటిత శక్తిగా ఏర్పాటు కావాలని రెండో రోజు కిసాన్ గ్రామీణ మేల కన్వీనర్ పి సుగుణాకర్ రావు రైతులకు పిలుపునిచ్చారు.

తమ పంటలను మార్పిడి చేసి విలువలను జోడించి వ్యాపారులూగా మారాలని అది సహకార సంఘాలు, ఎఫ్ పి ఓ ల ద్వారానే సాధ్యమని తెలిపారు. రైతులు అసంఘటితముగా ఉండటం వల్లనే ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం విద్యా, వైద్య, ఉత్పత్తి రంగాలలో జరిగిన అభివృద్ధి వ్యవసాయ రంగంలో కాకపోవడమే కారణమని అన్నారు. 70% ప్రజలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారని వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న కారణంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని వదులుతున్నారని అన్నారు.

కేవలం పంటలు పండించడం వరకు మాత్రమే పరిమితం అవటం వలన రైతు కష్టాలలో పడుతున్నారని పంట ఉత్పత్తులతో పాటు, పశుపోషణ, కూరగాయలు, పండ్ల తోటాలను పెంచడం లాంటి చర్యలతో రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు వ్యవసాయ ప్రదర్శనలతో రైతులకు అనేక విషయాలపై అవగాహన కలిగించే వారిని కానీ ఇప్పుడు కిసాన్ జాగరణ్ కిసాన్ గ్రామీణ మేళా ద్వారా కొత్త పద్ధతులు యంత్రాలు పనిముట్లు, రైతులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నాబార్డ్ అధికారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నాబార్డ్ ద్వారా రైతు గ్రామీణ వృత్తులు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలతో రైతు గ్రామీణ ప్రజల ఆర్థిక శక్తికి పాటుపడుతున్నాయని తెలిపారు.

ఖాదీ గ్రామీణ పరిశ్రమల రాష్ట్ర డైరెక్టర్ జి నారాయణరావు మాట్లాడుతూ గ్రామంలోని రైతులు వివిధ వృత్తుల వారు ఆర్థిక ఉన్నతికి కె వి ఐ సి కృషి చేస్తుందని కరీంనగర్లో వివిధ కులవృత్తులకు ఆర్థిక చేయూత ఇవ్వనున్నామని తెలిపారు. గ్రామీణ భారతి అధ్యక్షులు రాజా రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభ్యున్నతికై ప్రభుత్వాలతో పాటు సామాజిక సంస్థలకు కృషి చేయాలని గ్రామ భారతి ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు పత్తి పంట పురుగుల నివారణ పై డాక్టర్ శశిధర్ వివరించారు.

ప్రభుత్వ పశు వైద్య కళాశాల డీన్ మాధవరావు పశుపోషణ గురించి వివరించారు. పశువుల ఆరోగ్య సమస్యలపై డాక్టర్ అనిత వివరించారు. వెటర్నరీ విద్యా అవకాశాల గూర్చి డాక్టర్ సంతోషిని వివరించారు. కె.వి.కె శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అధిక వరి పత్తి పంటల గూర్చి వివరించారు. ఉత్తమ రైతులు వెంకట్ రెడ్డి మాధవరెడ్డి వారి అనుభవాలను వివరించారు. మంజీర సంస్థ ప్రతినిధి ఉదయ భాస్కర్ చేపల పెంపకం వలన కలగు లాభాలను వివరించారు. రెండవ రోజు దాదాపు పదివేల మంది రైతులకు పైగా కిసాన్ గ్రామీణ మేలని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మల్లేశం యాదవ్, సునీల్ రావు, దుర్గ మారుతి, ఆనంద్, మొలుగూరి కిషోర్ ,లక్ష్మణ్ ,మునీర్ ఖాన్, నరసింహారెడ్డి, జితేందర్ రెడ్డి, బలరాం సింఘ్, అంజి , ఎఫ్ పి ఓ అధ్యక్షులు కమలాకర్ రావు, వెంకట్ రెడ్డి, శంకరయ్య, పురుషోత్తం రావు, బాపురెడ్డి ,పరశురాములు తదితరులు పాల్గొన్నారు.