శతాబ్ది ఉత్సవాలతో ప్రజాధనం వృధా

శతాబ్ది ఉత్సవాలతో ప్రజాధనం వృధా
  • నాకు ఈటలకు మధ్య గ్యాప్ మీడియా సృష్టి
  •  మూడేళ్ల నుండి డిపాజిట్లు రాని కాంగ్రెస్ ఎట్ల గెలుస్తది
  •  ‘‘గ్రానైట్స్’’ వ్యాపారుల నుండి డబ్బు తీసుకోలేదు ప్రమాణం చేసేందుకు సిద్ధం 
  • ఖమ్మం నిరుద్యోగ మార్చ్ కు తరలిరండి
  •  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ జిమ్మిక్కు’’అని ధ్వజమెత్తారు. రాష్ట్రపతిని ఓడించాలనుకున్నోళ్లే ఆమెపై మొసలి కన్నీరు కారుస్తుండటం సిగ్గు చేటన్నారు. గత మూడేళ్లలో ఏనాడూ డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని కొన్ని పత్రికలు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. కరీంనగర్ లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన బండి సంజయ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఎవరి చేత చేయించాలనేది స్పీకర్ విచక్షణాధికారం. స్పీకర్  కోరిక మేరకు ప్రధాని  ప్రారంభిస్తున్నారు. అందులో తప్పేముంది? ప్రదాని పార్లమెంట్ ఉభయ సభలకు నాయకుడు. ఆయన ప్రారంభిస్తే ఇంత రాద్దాంతం చేయడమెందుకని మండిపడ్డారు.
వడగండ్ల వానకి నష్టబోయిన రైతులకి పరిహారం ప్రకటించి రెండు నెలలు అవుతున్న ఇప్పటికి అకౌంటు లో పడలేదన్నారు.  ఢీల్లిలో లిక్కర్ దందా చెసిన వారు తెలంగాణ లో చేయలేరా? తెలంగాణ లో జరిగే లిక్కర్ దందాను బయటికి తీస్తామన్నారు.  డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు కట్టివ్వలేదు? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఎందుకు ఇవ్వడం లేదు? ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.  నాకు, ఈటల, రాజగోపాల్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనేది మీడియా సృష్టి. ఒక సెక్షన్ మీడియా బీజేపీ గ్రాఫ్ ను తగ్గించి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇమేజ్ ను పెంచాలని చూస్తున్నదని ఆరోపించారు.
గంగులతో మిలాఖత్ పై గోనె ప్రకాశ్ రావు మాట్లాడుతూ  బండి సంజయ్ కు కోట్లు ముట్టినయని ఆధారాల్లేకుండా ఆరోపించడం కరెక్ట్ కాదు. నిజంగా నేను గ్రానైట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటే ఆధారాలు బయటపెట్టడండి. అధికారంలో ఉన్నది బిఆర్ఎస్ ప్రభుత్వమే కదా దర్యాప్తు చేయించండి అని సవాల్ విసిరారు.  అమ్మవారిమీద ప్రమాణం చేసి చెబుతున్నా నేను గ్రానైట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు. నా బ్యాంకు ఖాతాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఆధారాలు చూపితే పక్కకు జరుగుతా అన్నారు. ఖమ్మంలో నిర్వహించబోయే నిరుద్యోగ మార్చ్ కు భారీ ఎత్తున తరలిరావాలని నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.