గర్జించిన బండి

గర్జించిన బండి
  • తాగుబోతు చేతిలో తెలంగాణ
  • కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి
  • టెన్త్ లీక్ సెట్టింగ్ జడ్జితో విచారించాలి
  • కవిత, కేటీఆర్ జైలుకే
  • వరంగల్ లో నిరుద్యోగ మార్చ్
  • జైలు నుండి విడుదలైనా అనంతరం బిజెపి స్టేట్ చీఫ్ బండి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, పోలీస్ అధికారులపై నిప్పులు చెరిగారు. తాగుబోతు చేతిలో రాజ్యం నడుస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులే పేపర్ లీక్ కుట్ర దారులు అన్నారు. హిందీ పేపర్ లీక్ లో సంజయ్ కు ప్రమేయం ఉన్నట్లు వరంగల్ సిపి ప్రమాణం చేయాలన్నారు. లేకుంటే కెసిఆర్ చేతి మోచేతి నీళ్లు తాగినట్లే అని మండిపడ్డారు. సిపి రంగనాథ్ చరిత్ర మొత్తం బయటికి తీస్తామన్నారు. సిపి తీరుతో పోలీసులు తల దించుకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. పరీక్షల నిర్వహణ చేతగాక మాపై కుట్రలు పన్నుతున్నారు అని వెల్లడించారు. ప్రశ్న పత్రాల లీక్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. టెక్నాలజీలో మేము తోపు అని చెప్పుకునే కేటీఆర్ కేసును ఎందుకు చేదించడం లేదని ప్రశ్నించారు. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన కేటీఆర్ ను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ జైలుకు వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయని విమర్శించారు. లక్షలాది మంది నిరుద్యోగులతో వరంగల్ లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. నాపై పిడి యాక్ట్ పెట్టాలన్న మంత్రి హరీష్ రావు పై మర్డర్ కేసు నమోదు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది యువకుల బలిదానాలకు కారకుడు హరీష్ రావు అని ఆరోపించారు. నా అత్తమ్మ కొడుకులా నన్ను చూసుకుందని ఆమె అంతిమ సంస్కారాలు చేయాల్సిన బాధ్యత నాపై ఉందని తెలిసినా పోలీసులు కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా తెలపలేదని అన్నారు. పోలీసులు అరెస్టు చేసే తీరు తీవ్ర అభ్యంతరకరం అన్నారు. కుటుంబ సభ్యులను నెట్టివేశారని, ఇంట్లో వస్తువులను చెల్లాచెదురు చేశారని దీంతోపాటు పోలీసులు తనపై వ్యవహరించిన తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావులు ఉన్నారు.