జగన్ సర్కారుకు ఊహించని షాక్...

జగన్ సర్కారుకు ఊహించని షాక్...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఎన్నికలకు ముందు ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుందని వ్యాఖ్యానించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లి అందజేయడం జరుగుతోందని ప్రకటించింది.