వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

పెద్దశంకరంపేట, ముద్ర: పెద్దశంకరంపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం శ్రీ గోదా సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు. వేద బ్రహ్మ పండితుల మంత్రోచ్ఛారణలతో భాజా భజంత్రీల మధ్య, భక్తుల గోవింద నామస్మరణతో  స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పూజారులు రాయల కృష్ణ శర్మ, మహేష్ శర్మ, రామన్న పంతులు  కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త విగ్రాo శ్రీనివాస్ గౌడ్ దంపతులు స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిపించగా పెద్దశంకరంపేట పట్టణంతో పాటు పరిసర గ్రామ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు స్వామి వారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి తరలివచ్చారు. కళ్యాణ మండపాన్ని వివిధ రకాల పూలతో,  ఆలయాన్ని అరటి కొబ్బరి మెట్టెలతో అందంగా.

 ఆలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణోత్సవం తిలకించి స్వామివారికి పూజలు చేశారు. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  అంతర్గాం పీఠాధిపతి కరన్ భారతి మహారాజ్,  స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు.  విగ్రాo గంగాధర్ గౌడ్,  దాదిగారి గంగాధర్, మహంకాళి కృష్ణమూర్తి. రాజన్ గౌడ్. సర్వేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్, సతీష్ గౌడ్, కందుకూరి నర్సింలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, పేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, రాజేశ్వరరావు, తదితరులున్నారు.