నిరంకుశ పాలనను గద్దె దించాం .. ప్రజా పాలన ఏర్పాటు చేశాం

నిరంకుశ పాలనను గద్దె దించాం .. ప్రజా పాలన ఏర్పాటు చేశాం
  • ఆరు గ్యారెంటీలను పక్కా అమలు చేస్తాం
  • ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాలేదు
  • గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది
  • ఇబ్బంది పడుతున్న ప్రతి హామీని అమలు చేస్తా
  • రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి ముద్ర న్యూస్: ప్రజా ధనాన్ని లూటీ చేసి 9 సంవత్సరాలు నిరంకుశ పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్నిని ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ  ప్రజా పాలనలోకి తిసుకువచ్చామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం చిగురుమామిడి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో దానిని జీర్ణించుకోలేక పోతుంది. ఆ అక్కస్సుతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేస్తుంది.  

ఈ ప్రభుత్వాన్ని 420 అని విమర్శిస్తుంది.కాని అసలైన 420 పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. గత పాలనలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. నిర్బంధ పాలన సాగించింది. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి దోపిడి పాలనకు తెరతీసింది. బీఆర్ఎస్ నాయకులు లక్షల కోట్లు అక్రమ సంపాదనను సంపాదించుకొని.. రాష్ట్ర ప్రజల పైన ఏడు లక్షల కోట్ల అప్పుల భారం మోపింది. ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా మార్చింది. కానీ మా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో  పారదర్శక పాలన అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలుపరుస్తుందన్నారు.

 ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండే ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టామన్నారు. దానికి నిదర్శనంగా ఇచ్చిన 6 గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి అమలుపరుస్తున్నామన్నారు. మిగిలిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తూ వాటిని అమలు పరచడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని తెలిపారు. చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చిన మండల ప్రజలకు కార్యకర్తలకు  అయన కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధికి, గ్రామాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం లంబాడి పల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని స్థానిక ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్ తో కలిసి ప్రారంభించారు. మండలానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, నాయకులు హాయ్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఓరుగంటి భారతీయ దేవి, పూదారి వేణు, ఎనగందు లక్ష్మణ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.