అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం అందజేస్తాం

అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం అందజేస్తాం

ముద్ర, తుర్కపలి : అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం వర్తింప చేస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్ హాల్ లో గృహ లక్ష్మీ పథకం 282 మంది లబ్ధిదారులకు పట్టా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి ఇట్టి పథకాన్ని రూపొందించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, జెడ్పి వైస్ చైర్మన్ ధనావత్ బిక్కు నాయక్ , బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపరెడ్డి నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ మహాదేవుని శ్రీనివాస్, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కరుణాకర్, కోమటిరెడ్డి సంతోష, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, సర్పంచులు నాంసాని సత్యనారాయణ, సాగర్ల వాణీ పరమేష్ ,కల్లూరి ప్రభాకర్ రెడ్డి, వెన్నకూచి రామ్మోహన్ శర్మ, నాగారం మహేందర్, ఇమ్మడి మల్లప్ప, రామావత్ మంజుల మహేందర్ నాయక్ , సురేష్ శ్రీనివాస రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మోతిరామ్, ఎంపీడీవో బానోతు సరిత, మాజీ ఎంపీపీ బోరెడ్డి రామ్ రెడ్డి, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కార్యాలయం పర్యవేక్షకులు ఇన్నారెడ్డి ,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.