జాతర కోసం వేగంగా ముస్తాబవుతున్న యాదాద్రి మేడారం చల్లూరు సమ్మక్క సారలమ్మలు...

జాతర కోసం వేగంగా ముస్తాబవుతున్న యాదాద్రి మేడారం చల్లూరు సమ్మక్క సారలమ్మలు...

ముద్ర/రాజాపేట:- రాజాపేట మండలం యాదాద్రి మేడారం చల్లూరు సమ్మక్క సారలమ్మ జాతర కోసం వేగంగా ముస్తాబు అవుతోంది.  భక్తులకు ఎలాంటి ఆర్థిక నష్టం కలగకుండా ఇబ్బందులు పడకుండా ఉచిత రవాణా, ఉచిత వైద్యం, ఉచిత మంచినీటి సరఫరా, ఉచిత వసతి ఏర్పాటు, ఉచిత విద్యుత్తు ఏర్పాటు లతోపాటు చివరి రోజు ఉచిత ప్రసాద పంపిణీ కూడా నిర్వాహకులు చేపట్ట నున్నారు. మొదటి జాతర అయినప్పటికీ వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్న సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపడుతున్నారు.

ఈ సందర్భంగా గుట్టల పైన ఆహ్లాద వాతావరణం కమనీయమైన రమనీయమైన ప్రకృతి అందాల మధ్య  వెలసిన అమ్మవార్ల ప్రాంగణం భక్తుల సౌకర్యం కోసం చదును చేస్తూ ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ భక్తుల వసతి దుకాణాల ఏర్పాటు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రి మేడారం భక్తుల  జాతరగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈనెల 20వ తేదీన ఎల్లమ్మ బోనాలు, 21వ తేదీన సారలమ్మ గద్దెపైకి రావడం, 22వ తేదీన సమ్మక్క గద్దెపైకి రావడం, 23వ తేదీ మొక్కులు 24వ తేదీ అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుందని ఐదు జరిగే ఈ జాతరకు అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.