కేంద్రమంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం

కేంద్రమంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం

కేంద్రంలో మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీ మంత్రి వర్గంలో స్థానం సంపాధించి మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర సహాయమంత్రి రామ్ దా అఠావలెను తెలంగాణాకి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం నేషనల్ అంబేడ్కర్ సేన తరఫున సన్మానించారు. రామ్ దాస్ అఠావలె గత మూడు దశాబ్దాలుగా దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికోసం పాటుపడుతున్నారు. ఆయన సేవలను మెచ్చి... నరేంద్రమోదీ మరోసారి మంత్రిని చేసిన సందర్భంగా ఆయన నివాసంలో కలిసి మల్లు శివరాం నేషనల్ అంబేడ్కర్ సేన తరఫున పుష్పగుచ్చం ఇచ్చి... శాలువాతో సన్మానించారు.

కేంద్రమంత్రి సేవలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం, సాధికారత లభించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు నేరవేరినట్లని ఆయన పేర్కొన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా రామ్ దాస్ అఠావలె రాజకీయాల్లో రాణిస్తూ... పేదలకు ఆయన చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. తన తండ్రి గారైన స్వర్గీయ కీర్తిశేషులు మల్లు అనంత రాములు కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఆయన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిర గాంధి గారికి ఎంతో నమ్మకంగా మెలిగారు... అలాగే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పీసీసీ అధ్యక్షునిగా సేవలు అందించారన్నారు.

ఇప్పుడు తమ బాబాయిలైన మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవిలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నరేంద్రమోడీ మంత్రి వర్గంలో తన మిత్రుడు రామ్ దాస్ కేంద్ర సహాయక మంత్రి పదవిని పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక మిత్రునిగా ఆయనను ఇలా కలిసి సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా తమ స్నేమం కొనసాగుతుందని తెలిపారు. ఇద్దరి ఆశయాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని సాధించడమేనని... వాటికోసం పాటుపడతాం అని తెలిపారు. ఎప్పటికీ తమ స్నేహం కొనసాగుతుందని చెప్పారు.