గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: చండూరు ఎస్సై ఉప్పు సురేష్

గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: చండూరు ఎస్సై ఉప్పు సురేష్

చండూరు, ముద్ర: గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చండూరు ఎస్సై ఉప్పు సురేష్ అన్నారు. శనివారం" ముద్ర" దినపత్రికతో మాట్లాడుతూ, గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహించడం వలన  మహిళలపై, బాలికలపైఅత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు జరగడానికిప్రధాన కారణం అవుతాయని వారు అన్నారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామనివారు అన్నారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మత్తు పదార్థాలకుయువత దూరంగా ఉండాలనివారు అన్నారు.బహిరంగ ప్రదేశాల్లోమద్యం సేవిస్తే చర్యలు తప్పవని ప్రజలందరూ శాంతి భద్రతలకు సహకరించాలనివారు అన్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. ట్రాఫిక్ నియమాలనుఉల్లంఘిస్తూ,నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల గడువు ఈనెల 31 వరకు గడువు పొడిగించారని, పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలనివారన్నారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.