ఎన్నికల వేళ జనసేనకు భారీ ఊరట....ఆ పిటిషన్ కొట్టివేత

ఎన్నికల వేళ జనసేనకు భారీ ఊరట....ఆ పిటిషన్ కొట్టివేత

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఎన్నికల ముందు జనసేన  పార్టీకి భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు  మంగళవారం కొట్టేసింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్.. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయగా విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా, జనసేనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీనిపై జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు.

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. అలాగే, ఈసారి కూడా గాజు గ్లాస్ గుర్తుపైనే ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో నిలవనున్నారు.