బ్రేకింగ్ న్యూస్ - బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్....

బ్రేకింగ్ న్యూస్ - బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్....
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక రద్దు

ముద్ర,తెలంగాణ:-అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్ద సంఖ్యలో నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో డీలా పడ్డ బీఆర్ఎస్‌ను మరింత నిరుత్సాహ పరిణామం ఎదురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్‌ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది. దండె విఠల్‌ ఎమ్మెల్సీ ఎన్నికను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఆయనకు రూ.50 వేల జరిమానా కూడా విధించింది.