ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సాయంతో రైతులకు తీరనున్న కష్టాలు

ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సాయంతో రైతులకు తీరనున్న కష్టాలు
MLA Payla Sekhar Reddy helping to the farmers

వలిగొండ (ముద్ర న్యూస్): భీమలింగ కాలువ లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకు వలన తమకు సాగునీరు అందటం లేదని ఆయకట్టు రైతులు తమ సమస్యను ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన  భీమ లింగం కాలువ పూడిక తీత పనులకు తన సొంత నిధులతో ఇటాచి మిషన్లను పంపించి పనులు నిర్వహిస్తున్నారు.  గత 20 రోజులుగా జరుగుతున్న పనులను,  దాదాపు 15 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శనివారం వలిగొండ మండల నాయకులు, రైతులు  పనులను పరిశీలించి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కి కృతజ్ఞతలుతెలియజేశారు.  

ఈ కార్యక్రమంలో  వలిగొండ సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి ఐటిపాముల రవీందర్, సర్పంచ్లు సోలిపురం సాగర్ రెడ్డి, బొడ్డుపల్లి ఉమా కృష్ణ, గుడిసే రాజేశ్వరి నరసింహ, ఎంపిటిసి  మోటే నరసింహ, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గూడూరు శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీరాములు నాగరాజు, ఎమ్మె లక్ష్మయ్య, బీసీ సెల్ అధ్యక్షులు ఐటిపాముల ప్రభాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎడవల్లి శాంతికుమార్, గుట్ట డైరెక్టర్లు పోలేపాక బిక్షపతి ఎక్కల శ్రీనివాస్ ఏం సి డైరెక్టర్ పోలెపాక సత్యనారాయణ  గ్రామ శాఖ అధ్యక్షులు బోడిగే లింగస్వామి కౌకుంట్ల సోమిరెడ్డి  వీరమల్ల బాలేశ్వర్ మండల ఉపాధ్యక్షులు ఈతాప నరసింహ బుంగమట్ల సుధాకర్ పల్లెర్ల రామచంద్రు గంగ దారి రఘునందన్  గంధ మల్ల బ్రహ్మయ్య  పబ్బు నరసింహ పోలేపాక శ్రీశైలం  మోటే లింగస్వామి నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు గోపగోనీ నవీన్  యూత్ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ ఆజాం అమరేందర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.