Telangana Budget 2023-2024: రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్

Telangana Budget 2023-2024: రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్
Telangana Budget 2023-2024

2023–2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ అంచనాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,17,215గా ఉందని హరీశ్ రావు ప్రకటించారు. 

ఇక బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 26,931 కోట్లను కేటాయించింది. నీటి పారుదల శాఖకు రూ. 26,885 కోట్లు, విద్యుత్ కు  రూ.12,727 కోట్లు ఇచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు, దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం 15,233 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు కేటాయింపులు చేసింది.