అకాల వర్షంతో మార్కెట్ లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు కొండ నాగేష్   

అకాల వర్షంతో మార్కెట్ లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు కొండ నాగేష్   

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి:  నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ రాత్రి వర్షం కారణంగ మొక్కజొన్న, వేరుశెనగ తడవడంతో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నాయకులు కొండ నాగేష్ పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది, ఎప్పటిలాగే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం అయిన సరే రైతు నష్ట పోకుండ మద్దతు ధరకు విక్రయించాలని, రైతులకు సరైన వసతుల కల్పించాలని, 5రూపాయల భోజన కాంటీన్ వెంటనే తెరవాలని,మంచి నీళ్ళు వసతి కలిపించాలి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే భవనాలు, ప్రగతి భవన్, సెక్రటేరియట్ నిర్మించుకున్నారు,కానీ 7 సంవత్సరాల క్రితం హరీష్ రావు చే హట్టహాసంగా మార్కెట్ నిర్మించారు 2023  కావస్తున్నా పూర్తి స్థాయి పనులు కాకుండానే నాగర్. కర్నూల్ నుండి మార్కెట్ ఎందుకు తరలించారని ఇప్పటికైనా రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కొండ నాగేష్ గారు అన్నారు.