బీఎస్పీ నాయకుల అరెస్టు

బీఎస్పీ నాయకుల అరెస్టు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: సూర్యాపేట ముట్టడికి సమాయత్తం అవుతున్న బిఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి తాళ్ళపల్లి వెంకటస్వామి, మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ ని స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. తొమ్మిదేళ్లు మంత్రి జగదీష్ రెడ్డితో తిరిగిన జానయ్యపై లేని కేసులు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన తర్వాత రాత్రికి రాత్రే ఒకటే రోజులు 76 కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.