ధాన్యాన్ని ఏ గ్రేడ్ గా కొనుగోలు చేయాలి

ధాన్యాన్ని ఏ గ్రేడ్ గా కొనుగోలు చేయాలి
  • సిపిఎం మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా పండించిన వరి ధాన్యాన్ని ఏ గ్రేడ్ గా కొనుగోలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పగిళ్ళ లింగారెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలోని తహసిల్దార్ కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్ ఐ వెంకటరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ కూడా ధాన్యాన్ని బి గ్రేడ్ గా కొనుగోలు చేయడం లేదని, కేవలం పోచంపల్లి మండల ప్రాంతాన్ని మూసి ప్రాంతం పేరుతో ధాన్యాన్ని బి గ్రేడ్ గా కొనుగోలు చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా క్వింటాకు 500 బోనస్ ను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కోడె బాల నరసింహ, నాయకులు కోట రామచండ్రారెడ్డి ,ప్రసాదం విష్ణు, మంచాల మధు తదితరులు పాల్గొన్నారు.