క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన కేసీఆర్

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన కేసీఆర్

సీఎం కప్ విజేతలకు బహుమతులు అందజేసిన ప్రభుత్వ విప్ గొంగిడి, ఎమ్మెల్యే పైళ్ళ

ముద్ర ప్రతినిది, భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం సీఎం కప్ టోర్నమెంట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడవ రోజు వివిధ క్రీడా అంశాలలో ఫైనల్ మ్యాచ్ లలో  పోటీ నిర్వహించడం జరిగింది. అనంతరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరై క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని క్రీడల్లో ఎప్పుడూ కూడా లూసర్ ఉండరని రన్నర్ మాత్రమే ఉంటారని మొదటి స్థానం పొందిన వాళ్లు విజేతగా రెండవ స్థానం పొందిన వాళ్లు రన్నర్ గా ఉంటారని 2014 ముందు తెలంగాణలో 2014 తర్వాత 2023 వరకు తెలంగాణలో మనం తేడా చూడవలసిన అవసరం ఉందని ప్రతి గ్రామంలో వెళితే తెలంగాణ క్రీడా ప్రంగణలు కనిపిస్తున్నాయని చిన్నతనం నుండే పిల్లలకు ఆటల మీద ఆసక్తి కనబరచాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది అని ఈ తెలంగాణ క్రీడ ఉత్సవాలు ఘనంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఖర్చులతో మండల స్థాయి నుండి క్రీడలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా మాట్లాడారు.


భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి  మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ అభివృద్ధి కొరకు స్థానిక భువనగిరి జూనియర్ కళాశాల లో అన్ని క్రీడలు ఉండే విధంగా క్రీడమైదాన్ని ఏర్పాటు చేస్తున్నామని దానిని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని జిల్లాలో క్రీడలు మరింత అభివృద్ధి పరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని దానిని జిల్లా ప్రజలందరూ కూడా చిన్నతనం నుండి ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడారు.

ఈనెల 22 నుండి 24 వరకు జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా సీఎం కప్ టోర్నమెంటులో ప్రథమ బహుమతి కబడ్డీ విభాగంలో బీబీనగర్ మండలము, కబడ్డీ ద్వితీయ బహుమతి పోచంపల్లి మండలము, వాలీబాల్ మొదటి బహుమతి బొమ్మలరామారం మండలం రెండో బహుమతి తుర్కపల్లి మండలం , కోకో మొదటి బహుమతి భువనగిరి రెండో బహుమతి యాదగిరిగుట్ట మహిళా విభాగంలో మొదటి బహుమతి భువనగిరి రెండో బహుమతి బొమ్మలరామారం హ్యాండ్ బాల్ విభాగంలో పురుషులు మొదటి స్థానం తుర్కపల్లి రెండో బహుమతి బొమ్మలరామారం మహిళా విభాగంలో మొదటి బహుమతి బీబీనగర్ రెండో బహుమతి తుర్కపల్లి విభాగంలో 100 మీటర్స్ ధరావత్ మహేష్ తుర్కపల్లి మండలం రెండో బహుమతి పల్లె నవీన్ వలిగొండ మండలము 100 మీటర్స్ మహిళా విభాగం సిహెచ్ సంధ్య మోటకొండూరు మండలము దిరవ శిరీష యాదగిరిగుట్ట మండలం షాట్ పోట్ పురుషుల విభాగం బి అనిల్ బిబినగర్ మండలం చుక్కల వెంకట యాదవ్ రెండో బహుమతి ఆలేరు మండలం షాట్ పట్ మహిళా విభాగం మొదటి బహుమతి భువనగిరి మండలం రెండో బహుమతి మోటకొండూరు మండలం 400 మీటర్స్ పురుషుల విభాగంలో మొదటి బహుమతి వి సాయి నాయక్ రెండో బహుమతి ఉదయ్ కుమార్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉమెన్స్ విభాగం మొదటి బహుమతి దినోత్సవ రెండో బహుమతి తూర్పునూర్ పూజిత లాంగ్ జంపు పురుషుల విభాగం మొదటి బహుమతి డి మహేష్ తుర్కపల్లి మండలం రెండో బహుమతి లాంగ్ జంప్ మహిళా విభాగం సిహెచ్ సంధ్య మొదటి బహుమతి మోటకొండూర్ షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ పురుషుల విభాగం అనిరుద్ నారాయణపురం మండలం రెండో బహుమతి ధనుష్ భువనగిరి షటిల్ బ్యాడ్మింటన్ మహిళా విభాగం సాయి ప్రియ భువనగిరి మొదటి బహుమతి స్పందన రెండో బహుమతి భువనగిరి మండలంలో పురుషులు మొదటి బహుమతి ప్రియాంక హరిచరణ్ యాదగిరిగుట్ట మండలం మహిళా విభాగం డబుల్లో  సాయి ప్రియ మరియు స్పందన భువనగిరి మొదటి బహుమతి, ఎస్ కృష్ణవేణి మరియు ఎస్ జీవిత రెండవ బహుమతి యాదగిరిగుట్ట మండలం  సాధించడం జరిగినది అదేవిధంగా మండల స్థాయిలో 2189 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది జిల్లా స్థాయిలో 17 మండలాల నుండి సుమారు 1123 మంది క్రీడాకారులు 11 విభాగాల్లో పాల్గొనడం జరిగిందని జిల్లాలో విజయం సాధించిన జట్లను మరియు రాష్ట్రస్థాయిలో పాల్గొని క్రీడలకు క్రీడాకారులకు ఈనెల 27 నుండి 31 వరకు రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడా ప్రాంగణాల్లో జరిగే క్రీడలకు 27వ తారీఖు నాడు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి పంపడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి  గ్రంథాల సంస్థ చైర్మన్ జడల అమరేందర్  భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు , భువనగిరి మండల అధ్యక్షురాలు నరాల నిర్మల,  వైస్ చైర్మన్ భువనగిరి మున్సిపాలిటీ చింతల కృష్ణయ్య  ,  ఎస్ జి ఎఫ్  సెక్రటరీ స్టాలిన్ బాబు కోకో అసోసియేషన్ సెక్రటరీ రాష్ట్ర నాతి కృష్ణమూర్తి, ఎస్ ఎల్ ఎన్ ఎస్ కళాశాల పిడి పాండు రంగం, పీటీలు పుల నాగయ్య, మధుసూదన్ పీఈటీలు పీడీలు పాల్గొన్నారు.