ఒక్క అవకాశం ఇచ్చి చూడండి

ఒక్క అవకాశం ఇచ్చి చూడండి
  • ఓటర్లకు కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ అభ్యర్థన

ముద్రప్రతినిధి, బీబీనగర్: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ మాత్రమేనని, ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించమని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఆయన సోమవారం బీబీనగర్ మండలంలోని రాఘవాపురం, రుద్రవెల్లి, పల్లెగూడెం తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాఘవాపురంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు అనిల్ కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. రాఘవాపురం గ్రామంలో పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఉన్నారు. ఆయా గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. నాయకులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, సురకంటి  సత్తి రెడ్డి  , బండారి ఆగమయ్య గౌడ్, సంధిగారి బస్వయ్య , గడ్డం బాలకృష్ణ గౌడ్, పంజాల వెంకటేష్ గౌడ్ తదితరులు అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.