మిత్రపక్షాల అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన నాయకులు....

మిత్రపక్షాల అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన నాయకులు....

ఆలేరు ((ముద్ర న్యూస్):నవంబర్ 30న జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా సిపిఐ. తెలుగుదేశం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నప్పుడే ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్. సిపిఐ నాయకులు అన్నారు. మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని పలు కాలనీలలో నాయకులు వేరువేరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు పాము అనిత మాట్లాడుతూ అనేకమంది అమరవీరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రెండు పర్యాయాలు ముఖ్య మంత్రిగా ఎన్నికై లక్ష కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల లోటు బడ్జెట్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై అప్పుల భారం మోపారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఆరు పథకాల గ్యారంటీ పథకాన్ని తీసుకువచ్చారని వివరించారు. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆలేరు శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న బీర్ల అయిలయ్య అనేక సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ. వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో సైతం ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రజల మనిషిని చట్టసభలకు పంపించడం ద్వారా ప్రజా సమస్యలను శాసనసభలో చర్చించి. పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గతంలో రెండు పర్యాయాలు శాసనసభ సభ్యురాలుగా ఎన్నికై ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గ కేంద్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గుత్తా శమంత సీతారాం రెడ్డి. సిపిఐ జిల్లా నాయకులు చెక్క వెంకటేష్. నాయకులు మాటూరి జానమ్మ. కాంగ్రెస్ నాయకులు ఎంఏ ఎజాజ్. మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎండి జైనుద్దీన్. ఎగ్గిడి శ్రీశైలం. బీజాని భాస్కర్. బెదరకోట లక్ష్మణ్. ముదిగొండ శ్రీకాంత్. బరిగే శ్రీనివాస్. పాము శివ తో పాటు తదితరులు పాల్గొన్నారు.