సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి

సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి
  • కాంగ్రెస్, బీజేపీలు అవిభక్త కవలలు
  • బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
  • ముస్లింల ఆత్మీయ సమావేశంలో మంత్రి గంగుల

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటేనని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, కరీంనగర్ బారసా అసెంబ్లీ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు.ఆదివారం  హుస్సేన్ పుర నేషనల్ ప్యాలస్ లో ముస్లీం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, గంగుల కమలాకర్  హాజరైనారు.

ఈ సందర్బంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో   ఎక్కడ చుసిన గొడవలు, శాంతి భద్రతల సమస్యలు 144 సెక్షన్ లు, లాఠీఛార్జి లు ఉండేవని అన్నారు. రాజకీయ అవసరాల కోసం హిందూ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందే వారని వెల్లడించారు. బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు భయం భయంగా గడిపే వారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హిందూ ముస్లింలు ఒకటై కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు. కెసిఆర్ హయంలో కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారని గుర్తు చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెద్దపెద్ద కంపెనీలో తరలివస్తాయని, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని వెల్లడించారు.  కానీ ప్రతిపక్షాలు వేస్తే కరెంటు నీళ్లు తెలంగాణ సంపదనను దోచుకుంటారని, కరీంనగర్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని అభివృద్ధిని చూసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ఆశీర్వదించాలని వేడుకున్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.