రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే: కవ్వంపల్లి

రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే: కవ్వంపల్లి

 శంకరపట్నం ముద్ర నవంబర్ 13: మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన చెప్పారు. శంకరపట్నం మండల పరిధిలోని ఆముదాల పల్లి, చింతలపల్లి,లింగపూర్,కొత్తగట్టు  గ్రామాలలో సోమవారం విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వచ్చినా నియామకాలు జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలలో మహాలక్ష్మి పథకం కుటుంబంలో మహిళకు నెలకు 2500 రూపాయలు నగదు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,500 కి గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లుతెలిపారు.

ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడి ఆర్థిక సహాయం, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. జల్సా రాయుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానికుడు కాదని రావుకులకు తరిమికొట్టాలని ఆయన అన్నారు. గత పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ లోకి చేరికలు : శంకరపట్నం మండలంలోని ఆమదాలపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ కన్నెబోయిన జంపయ్య  తో పాటు 8 మంది వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచ్ గడ్డం సారయ్య,మాజీ ఎంఈఓ గడ్డం జమదగ్ని, దాదాపుగా 200 మంది  గ్రామ ప్రజలు కవ్వంపల్లి  సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.