రిజర్వ్ ఇన్స్పెక్టర్ సురేష్ కు అభినందనలు

రిజర్వ్ ఇన్స్పెక్టర్ సురేష్ కు అభినందనలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కేంద్ర హోం మంత్రి పతకం  పొందిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ మోడెం సురేష్ ను సోమవారం కరీంనగర్ ప్రిన్సిపాల్ అరవింద్ బాబు అభినందించారు. గతంలో పీటీసీ లో దాదాపు 8 సంత్సరాలు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం అభినందనీయం అన్నారు. పీటీసీ ఏర్పాటు దగ్గర నుండి ఈ అవార్డు రావడం ఇదే మొదటిసారి. ఇందుకుగాను వైస్ ప్రిన్సిపాల్ రవి ,ఏ ఆర్ డీఎస్పీ గంగాదర్ , పలువురు పోలీస్ అధికారులు సురేష్ ను అభినందించారు.