గాగిరెడ్డి పల్లి గ్రామంలో కంటి వెలుగు శిభిరం ప్రారంభం

గాగిరెడ్డి పల్లి గ్రామంలో కంటి వెలుగు శిభిరం ప్రారంభం

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గాగిరెడ్డిపల్లి గ్రామములో బుధవారం ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమమును గ్రామ సర్పంచ్ సన్నిల్ల వెంకటేశం,మండల వైద్యాధికారి  డా.ధర్మ నాయక్ తో కలిసి ప్రారంభించారు. అలాగే కొండాపూర్ గ్రామములో కంటి వెలుగు కార్యక్రమము యదావిధిగా కొనసాగుతుంది.  గాగిరెడ్డి పల్లి, కొండాపూర్ గ్రామ ప్రజలు కంటివెలుగు వైద్యశిబిరాన్ని  సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డా. ధర్మ నాయక్ కోరారు.ఇప్పటివరకు కంటి వెలుగు  కార్యక్రమంలో మండలపరిధిలోనీ 20,471 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని,4,137మందికి రీడింగ్ అద్దాలను, 3,505 మందికి  ప్రిస్క్రిసన్ అద్దాలను  పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమములో క్యాంప్ మెడికల్ ఆఫీసర్లు డా. ప్రత్యూష,  డా. శ్రావణి, ఆప్తోమెట్రిస్ట్ శ్రీనివాస్,   ఏఎన్ఎం లు జ్యోతి,సరస్వతి,  మహేష్, వార్డుసభ్యులు  కల్వల సువర్ణ, బరిగల రేణుక,దొంతరవెని సదానందం,గట్టు సంపత్  ,మంద సంధ్య,మంద రవి, పంచాయితీ కార్యదర్శి సూర్య ప్రకాష్,గ్రామ నాయకులు ,ఆశ కార్యకర్తలు , అంగన్వాడీ టీచర్లు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.