బీఆర్ఎస్ లోకి దరువు ఎల్లన్న

బీఆర్ఎస్ లోకి దరువు ఎల్లన్న

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన మానకొండూర్ బీజేపి టికెట్ ఆశీంచి భంగపడ్డ విద్యార్థి ఉద్యమ నేత దరువు ఎల్లన్న నేడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడు. బీజేపి రాజీనామా చేసిన తర్వాత తన అనుచరులతో.. కార్యకర్తలు, సన్నిహితులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు ఫోన్ లో మాట్లాడించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ లోకి దరువు ఎల్లన్న బృందాన్ని ఆహ్వానించడంతో ఒప్పుకున్న ఎల్లన్న నేడు హైదరాబాద్ లో తెలంగాణా భవన్లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గూలాభి కండువా వేసుకోబోతున్నాడు. ఈ మేరకు మానకొండూర్ నియోజకవర్గం నుంచి బారి కార్ ర్యాలీ నిర్వహించి హైదరబాద్కు తరలివెళ్లనున్నారు.