దశాబ్ది ఉత్సవాల్లో.. కేటీఆర్ మేనభావ సంచలన నిర్ణయం..

దశాబ్ది ఉత్సవాల్లో.. కేటీఆర్ మేనభావ సంచలన నిర్ణయం..
  • తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన వారికి సిరిసిల్ల లో సన్మాన సభ
  • సన్మానాన్ని తిరస్కరించిన కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావ్
  • సిరిసిల్ల బీఆర్ఎస్ నేత జిందం చక్రపాణితోనైన సత్కారం చేసుకుంటా కానీ.. ఆ ఎమ్మెల్యే  స్టేజీపై ఉండగా నాకు ఆ సత్కారం వద్దు
  • తెలంగాణా ఉద్యమంలో జైలుకెళ్లిన వారికి న్యాయం జరిగే వరకు నేనే ముందుంట
  • నేను పార్టీకి పని చేసుకుంటూ పోయా.. ఏనాడు సత్కారాలు కోరుకోలే.
  • నాకు బాస్ కేటీఆర్.. ఆయన మార్గదర్శకంలో పని చేస్తా.. 
  • టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించిన ఆ వ్యక్తి చేతుల మీదుగా నాకు సత్కారం వద్దు
  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావ్ నిర్ణయం పై  సర్వత్రా చర్య

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావు తెలంగాణా దశాబ్ధి ఉత్సవాల్లో ప్రముఖుల సత్కారాన్ని తిరస్కరించి సంచలనం సృష్టించారు. అవును నేను తెలంగాణా ఉద్యమం లో పని చేసిన ..జైలు కెళ్లిన.. నాకు సత్కారం వద్దు..నాతో పాటుజైలుకెళ్లి వచ్చిన వారందరికి సత్కరించండి అంటూ.. అసహానానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి దూరంగా ఉండి.. టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిచంన వ్యక్తి చేతుల మీదుగా నేనట్ల సత్కారం చేసుకుంటా అంటూ.. సన్నిహితుల వద్ద వాపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి తెలంగాణా అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణా ఉద్యమంలో పోలీసు కేసులు ఎదుర్కోని..జైలుకెళ్లిన ఉద్యమకారులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు..ఇతర ముఖ్య నేతలు హజరయ్యారు. మొదట ఈ కార్యక్రమానికి ఒప్పుకున్న చీటీ నర్సింగరావు స్టేజీ పై ఓ ఎమ్మెల్యేను చూడగానే..మనసు మార్చుకోని సత్కారాన్ని తిరస్కరించాడు. సెస్ ఎన్నికల్లో సైతం ఆ ఎమ్మెల్యే తో హైదరాబాద్ ప్రగతి భవన్లో తీవ్ర స్థాయిలో ఘర్షణ ఐనట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన ఉద్యమకారులకు మంచి రోజులు వచ్చే వరకు.. పదవులు వచ్చేవరకు తాను ముందుంటానని... మంత్రి కేటీఆర్ తో చెబుతానని సన్నిహితుల వద్ద పేర్కొన్నారు. సత్కారాన్ని ఎందుకు చేసుకోలేదు అంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు అడగగా.. బీఆర్ఎస్ అభ్యర్థినే ఓడించి గెలిచిన వ్యక్తి.. తర్వాత పార్టీలోకి వచ్చి నన్ను సత్కరిస్తా అంటే ఎట్ల.. నాకు సత్కరాలు అవసరమా.. నేను ఏనాడు సత్కారలు..సన్మనాలు కోరుకోలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ ఎమ్మెల్యేతో చీటీకి విబేధాలు.. మరోసారి బహిర్గతం..

రాజన్నసిరిసిల్ల జిల్లాలో తెలంగాణా ఉద్యమంలో.. బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి పని చేసిన వ్యక్తి కేటీఆర్ మేనభావ  చీటీ నర్సింగరావ్. పార్టీ అవిర్బావం నుంచి పని చేసిన.. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో చీటీకి ఒక్క పదవి రాలేదు. నర్సింగరావుకు పదవి ఇస్తే బంధువుకు ఇచ్చారని విమర్శలు వస్తాయంటూ మంత్రి కేటీఆర్ సున్నితంగా చెబుతూ నర్సింగరావుకు నచ్చచెబుతూ వచ్చారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో సెస్ చైర్మన్గా మంచి అవకాశాలు ఉండటతో చీటీ నర్సింగరావ్ తంగళ్లపల్లి మండలం నుంచి పోటీ చేయాలని ఆశీంచి.. బారి ర్యాలీలు.. సభలు ఏర్పాటు చేసి.. తన గ్రౌండ్ వర్క్తాను చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే చీటీ నర్సింగరావుపై ప్రగతిభవన్లో మాట విడిచారని తెలిసింది. నా నియోకవర్గం ఐతే కాళ్లు విరగ్గొట్టేవాన్ని.. పార్టీ అనుమతి లేనిది మండలంలో ఎట్ల తిరుగుతారు..ప్రెస్మీట్లు ఎట్ల పెడతారు అంటూ సదరు ఎమ్మెల్యే అనడంతో.. బీఆర్ఎస్ పార్టీలో గింత నియంతృత్వం నడవదు.. నీ నియోజకవర్గం నీవు చూసుకో అంటూ చీటీ కూడా గట్టిగన సమాదానం ఇవ్వడం..పక్కనే ఉన్న టెస్కాబ్ చైర్మన్ కొండూరితో పాటు పలువురు సముధాయించి దూరం తీసుకోవడంతో అప్పుడు గొడవ సద్దుమనిగింది. చీటీని తప్పించి చిక్కాల రామారావును సెస్ చైర్మన్ చేశారు. అప్పటి నుంచి చీటీకి.. సదరు ఎమ్మెల్యే సాబ్కు మనస్పర్ధలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ నేఫధ్యంలోనే ఉద్యమకారుల సత్కారాల్లో తన పేరు ఉన్న సదరు ఎమ్మెల్యేను చూసి .. తిరస్కరించినట్లు బీఆర్ఎస్ లో చర్చ కొనసాగుతుంది. ఈ విషయంపై ముద్ర చీటీ నర్సింగరావును వివరణ కోరగా..అవును సత్కారాన్ని తిరస్కరించాను.. వాస్తవమే అంటూ ప్రకటించారు. తనతో పాటు జైలుకు వచ్చిన వారికి మంచి పదవులు వచ్చిన్నాడు నేను మంచి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేస్తానని..బీఆర్ఎస్ అభ్యర్థినే ఓడించి పార్టీలో చేరిన వారితో నేను సత్కారం చేయించుకోవడం ఏంటని.. ఆ స్టేజీపై ఉన్న వారిలోచాలా మందిపై తనకు గౌరవం ఉందన్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ నేత జిందం చక్రపాణి సన్మానాన్ని నేను స్వీకరిస్తాను కానీ.. ఉద్యమకు సంబంధం లేని వ్యక్థుల సమక్షంలో నాకు అవసరం లేదు అని మనసుకు అనిపించిందని.. పేర్కొన్నారు. ఈ విషయం చిన్నది అని.. పెద్దగా చూడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఏది ఏమైన పార్టీ కోసమే తాము పని చేస్తామంటూ చీటీ నర్సింగరావు ప్రకటించడం కొసమెరుపు.