తుంగతుర్తి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఇంటింటా ప్రచారం

తుంగతుర్తి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఇంటింటా ప్రచారం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి పట్టణంలో  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా 231 బూతులో  ఇంచార్జ్ గునిగంటి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని ఇంటింటా ప్రచారంలో స్పందన భేష్ గా ఉందని అన్నారు. సంక్షేమ పథకాలలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతుందని ప్రజలు చెబుతున్నారని రానున్న ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను ఓటు వేసి గెలిపిస్తామని ప్రజానీకం చెబుతున్నారని అన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గెలుపొందడం ఖాయమని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల నాగమల్లు, ఉప్పుల వీరయ్య  జవ్వాజి నాగరాజు, నార బోయిన అనిల్ నాగవెల్లి రమేష్, గుండెబోయిన రవి ,మెత్తబోయిన బిక్షం ,మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.