చేపల పెంపకం తో స్వయం పోషకత్వం - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

చేపల పెంపకం తో స్వయం పోషకత్వం  - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని ,మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్ట్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని, కుల వృత్తులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. ఇందులో భాగంగా చేప పిల్లలను చెరువులో వదలడం జరిగిందన్నారు.  చేపలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.