తుంగతుర్తి లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు

తుంగతుర్తి లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు
  • గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం
  • గ్రామపంచాయతీ వర్కర్లకు చీరలు పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు

తుంగతుర్తి ముద్ర: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సోమవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలు పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ,ఉద్యోగ సంఘాల కార్యాలయాలు , తదితర చోట్ల జాతిపిత చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యం సమరంలో ఆయన పోషించిన పాత్ర, అహింసా మార్గంలో చూపిన దారి నేడు అందరికీ ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. నేటి యువత గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ సహకారంతో గ్రామపంచాయతీ వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తాటికొండ సీతయ్య, ఓరిగంటి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఈగ నాగన్న, కోశాధికారి మా శెట్టి వెంకన్న, వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు వీణ వినయ్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు తల్లాడ కేదారి, తల్లాడ బిక్షం, తల్లాడ శ్రీహరి, బండారు నాగన్న, గోపారపు సత్యనారాయణ, బుద్ధ వీరన్న, పోలవరపు సంతోష్, ఓరుగంటి అశోక్, మహిళా అధ్యక్షురాలు తల్లాడ సూర్య కళ,సులోచన, ఈగ కవిత, తల్లాడ శ్రీను, కొమటాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.