సూర్యాపేట లో కేసీఆర్ కెటిఆర్, జిజేఆర్ భారీ ఫ్లెక్సీలకు పాలాభిషేకం

సూర్యాపేట లో కేసీఆర్ కెటిఆర్, జిజేఆర్ భారీ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
  • తమ ఐటి హబ్ కల ను సాకారం చేస్తున్నందుకు కృతజ్ఞతగా బిఆర్ఎస్వి ఆధ్వర్యం లో పాలాభిషేకం 
  • పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగ యువత
  • ముఖ్యమంత్రి, మంత్రులకు అనుకూలంగా నినాదాలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తాము కలలో కూడా ఊహించని విధంగా సూర్యాపేటకు ఐటి హబ్ రావడం పట్ల యువత ఆనంధం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటకు వైద్యం తెచ్చి ఇంటి పట్టునే నే ఉండి ఉద్యోగాలు చేసుకునే విధంగా  ఐటి హబ్ తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి లకు యువతీ, యువకులు నీరాజనం పలుకుతున్నారు. నేడు సూర్యాపేటలో ఐటి హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కెసిఆర్ కేటీఆర్, జిజేఆర్ చిత్రపటాలకు యువతీ యువకులు పాలాభిషేకం నిర్వహించారు. ఐటి హబ్ తీసుకొస్తానని సూర్యాపేట శాసనసభ్యులు, మంత్రి జగదీష్ రెడ్డి గారు 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం నిజంగా ఆనందదాయకం అన్నారు. ఐటి హబ్ వస్తుందని తాము కలలో కూడా ఊహించలేదన్నారు. మెట్రో నగరాలకు దీటుగా సూర్యాపేటలో దిద్దడం తో పాటు, యువతీ యువకులు దుర ప్రాంతాలకు వెళ్లకుండా ఐటి హబ్ ను ఇక్కడకి తీసుకురావడం గొప్ప విషయం అన్నారు.

ఐటి హబ్ తో పాటు యువతీ యువకులకు వృత్తిపరమైన నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయడం మాలాంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఎంతగానో ఉపయోగమన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిలు, కేటీఆర్, ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతామని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థి లోకమంతా బీఆర్ఎస్ పార్టీ వైపు అని తెలిపారు. బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో మొన్న మధు నాయుడు,  దాసరి అరుణ్, మండాది గోవర్ధన్, రామచంద్రారెడ్డి, సాయి, సంపత్, మహేష్, బన్నీ, సుమలత, శివరాం రెడ్డి, బిందు, రిషి, రంజిత్, వర్షిత్, కృష్ణ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు