సీఎం కేసీఆర్, కేటీఆర్ ల అభివృద్ధికి దార్షనికతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ హబ్స్, జరిగిన అభివృద్ధి

సీఎం కేసీఆర్, కేటీఆర్ ల అభివృద్ధికి దార్షనికతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ హబ్స్, జరిగిన అభివృద్ధి
  • గుజరాత్, భారత్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
  • మోడీ రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారనడానికి నిదర్శనమే యాదాద్రి పవర్ ప్లాంట్ అనుమతిని అడ్డుకోవడమే.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12స్థానాలు మళ్ళీ గులాబీ పార్టీవే.
  • పొలాలు ఎండిపోతున్నాయని కరెంటు లేదని చెప్పే కాంగ్రెస్ నాయకులు కరెంటు వైర్ పట్టుకుంటే తెలుస్తుంది.
  • సూర్యాపేట శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: 24 గంటల విద్యుత్ గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఏ క్షణాన్నైనా విద్యుత్ తీగలు పట్టుకోవచ్చు అని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు అబద్ధాలు మాట్లాడడం లో మోడీనీ మించినోడు లేడనీ ఎద్దేవా చేశారు
మోడి రైతు రుణ మాఫీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు.

గుజరాత్ రైతులు కూడా మోడీ వైఖరి చూసి నవ్వుకుంటున్నారనీ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 35 వేల కోట్ల రుణమాఫీ చేసింది,గుజరాత్ లో 35 రూపాయలు కూడా మాఫీ చేయలేదనీ ధ్వజమెత్తారు.
రైతు బందు ఏడాదికి 75 వేల కోట్లు ఇస్తున్నాం అని,గుజరాత్ లో 10 రూపాయలైనా ఇస్తున్నారా ? అని ప్రశ్నించారు.