బండి ఒక్కంటికి @500 ఆవిర్భావ వేడుకల వేళ ఎడ్లబండ్లకు బలే గిరాకి!

బండి ఒక్కంటికి @500 ఆవిర్భావ వేడుకల వేళ ఎడ్లబండ్లకు బలే గిరాకి!

కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దశబ్ది ఉత్సవాల సందర్భంగా ఎడ్లబండ్లకు భలే గిరాకీ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో శనివారం రైతు వేదికల వద్ద నిర్వహించిన ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండ్ల ర్యాలీకి ఎడ్ల బండ్లు పెద్ద ఎత్తున అవసరం కావడంతో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు శనివారం వారాంతపు సెలవు కారణంగా మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులను మిల్లుల వద్దకు ఎగుమతి చేసే ఎడ్లబండ్లను అద్దెకు తీసుకువచ్చారు. ఒక్కో బండికి 500 చొప్పున చెల్లించి 20 బండ్లతో ర్యాలీ నిర్వహించి, అనంతరం ఎడ్లబండ్లను తీసుకొచ్చిన కార్మికులకు 500 చొప్పున చెల్లించారు.