మహబూబాబాద్ లో వైభవంగా సీతారాముల కళ్యాణం..

మహబూబాబాద్ లో వైభవంగా సీతారాముల కళ్యాణం..

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మహబూబాబాద్ లోని గాందీపార్క్ లో సీతారామచంద్రస్వామివారి కళ్యాణోత్సవం గురువారం అంగరంగవైభవంగా జరిగింది. రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి కల్యాణ వీక్షించడానికి ఇక్కడికి  పెద్ద ఎత్తున వచ్చిన భక్తులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి కృప కటాక్షం ఈ జిల్లా ప్రజలకు ఎల్లవేళలా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  పాలనలో దేవాలయాలకు మహర్దశ వచ్చింది.

మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతి పురాతన, చారిత్రాత్మక ఆలయాలు కూడా అభివృద్ధి చెందాయి.మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవతి రాథోడ్ తో పాటు శాసనసభ్యులు శంకర్ నాయక్-డాక్టర్ సీతమహాలక్ష్మి దంపతులు, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌  యండిఫరీద్‌, ఉత్సవ కమిటీ  చైర్మన్ డాక్టర్‌ బి అనిల్‌గుప్త, మాలె నాగేశ్వర్‌రావు, నాయిని రంజిత్‌ రెడ్డి, వూరె గురునాధరావు, గద్దె రవి, ఓం నారాయణలోయ, మార్నేని వెంకన్న, బోనగిరి గంగాధర్‌, మార్నేని రఘు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.